తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓటుకు నోటు కేసు : సండ్రకు హైకోర్టులో చుక్కెదురు

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం సండ్ర డిశ్చార్జ్​ పిటిషన్‌ను కొట్టివేసింది.

mla-sandra-venkata-veeraiah-discharge-petition-dismissed-in-high-court
ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో చుక్కెదురు

By

Published : Dec 8, 2020, 8:31 PM IST

ఓటుకు నోటు కేసులో శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​ను అనిశా కోర్టు కొట్టివేయడం వల్ల... ఆయన హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

విచారణ జరిపిన న్యాయస్థానం సండ్ర డిశ్చార్జ్ పిటిషన్​ను కొట్టివేసింది. మరోవైపు అనిశా న్యాయస్థానంలో ఇవాళ కేసు విచారణకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నేటి విచారణకు హాజరు మినహాయింపు కోరడం వల్ల అంగీకరించిన కోర్టు.. ఈనెల 15న కచ్చితంగా నిందితులందరూ హాజరు కావాలని.. హాజరు మినహాయింపును అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10 వరకు స్టే పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details