హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో తన క్వార్టర్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. విశ్వమానవాళికి స్ఫూర్తి ఈ గ్రీన్ ఛాలెంజ్ అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హరితహారం ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర కార్యక్రమమని మంత్రి ప్రశంసించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. హరిత హారానికి కొనసాగింపే ఈ గ్రీన్ ఛాలెంజ్ అని తెలిపారు.