తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR:'క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి'

విధానాల రూపకల్పనలో చూపుపుతున్న చొరవ, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సమర్ధ నాయకత్వం వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు సహా ఏ రంగంలోనైనా రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరుస్తోందని వివరించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సేవలను విస్తరించేందుకు.. మరిన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపిన కేటీఆర్‌... చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

minister ktr released annual report on it and industrial sectors
minister ktr released annual report on it and industrial sectors

By

Published : Jun 10, 2021, 12:50 PM IST

Updated : Jun 10, 2021, 2:23 PM IST

'క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి'

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, సమర్ధ నాయకత్వం వల్లే తెలంగాణ రాష్ట్రం... అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తోందని..... పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీశాఖల వార్షిక నివేదిక విడుదల చేసిన కేటీఆర్... కొవిడ్‌ సమయంలోనూ దేశ సగటును మించి అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మంచిప్రగతి సాధించామని వివరించారు. దేశంలో తలసరి ఆదాయం లక్ష 27వేల 768గా ఉంటే... రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 27వేల 145 గా....ఉందని పేర్కొన్నారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామన్న ఆయన.. జాతీయస్థాయితో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందని తెలిపారు. బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్న కేటీఆర్​.. ప్రముఖ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వవిధానాలు నచ్చి ఒకసారి పెట్టుబడిన వారిలో 80 శాతం మరోసారి పెట్టుబడులు పెడుతున్నారని గుర్తుచేశారు.

ద్వితీయ శ్రేణి నగరాలకు శరవేగంగా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీటవర్స్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపిన ఆయన... త్వరలో మరో మూడు జిల్లాల్లో ఐటీ టవర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. . ఎలక్ట్రానికి రంగంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేసిన మంత్రి... త్వరలో మహబూబ్‌నగర్ దివిటి ప్రాంతంలో సోలార్ పార్క్ ప్రారంభించనున్నట్లు వివరించారు. టీహబ్‌ రెండోదశ, టీవర్క్స్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు.

వైద్యరంగానికి హైదారాబాద్‌ను హబ్‌గా తీర్చిదిద్ధడంలో... ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని కేటీఆర్‌ వివరించారు. జినోమ్‌ వ్యాలీలోని పరిశ్రమలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఫార్మాసిటీని ప్రారంభించనున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

కొవిడ్‌ వల్ల ఎన్నోరంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తుచేసిన కేటీఆర్‌.... ప్రభుత్వం సాధ్యమైనంత వరకు వారికి అండగా నిలుస్తోందని గుర్తుచేశారు. అందులో భాగంగా వివిధ రకాల రాయితీలు అందించినట్లు తెలిపారు. ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అన్నిరంగాల్లో సమతుల్య అభివృద్ధి సాధిస్తున్న అరుదైన రాష్ట్రం.. తెలంగాణ మాత్రమేనని కేటీఆర్​ వివరించారు.

ఇదీ చూడండి: Fake Seeds: రూ.13 కోట్ల విలువైన నకిలీ మిరప విత్తనాలు స్వాధీనం

Last Updated : Jun 10, 2021, 2:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details