శాసనమండలి ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది. అసెంబ్లీలో మంగళవారం ఆమోదం తెలిపిన నాలుగు బిల్లులను ప్రభుత్వం కౌన్సిల్లో ప్రవేశపెట్టనుంది. స్టాంపు, నాలా చట్టాలకు సవరణ బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెడతారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, సీఆర్పీసీ చట్టసవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెడతారు. బిల్లుల ఆమోదం కోసం వెంటనే చర్చ కూడా చేపడతారు. చట్టసవరణ బిల్లుల ఆమోదంతో ప్రత్యేక సమావేశాలు ముగుస్తాయి.
బిల్లుల ఆమోదం కోసం నేడు మండలి ప్రత్యేక భేటీ..
శాసనసభ ఆమోదించిన నాలుగు చట్టసవరణలు ఇవాళ పెద్దలసభ ముందుకు రానున్నాయి. ఇందుకోసం శాసన మండలి ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేవలం బిల్లులకు ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ఇతర అంశాలపై చర్చకు అవకాశం లేదు.
బిల్లుల ఆమోదం కోసం నేడు మండలి ప్రత్యేక భేటీ..
11 గంటలకు సభ ప్రారంభం కాగానే నేరుగా బిల్లులు ప్రవేశపెడతారు. ఆమోదం తరువాత సభ వాయిదా పడుతుంది. ఎలాంటి ఇతర అంశాలపై చర్చకు అవకాశం లేదు. ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేస్తూ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే బులెటిన్ జారీ చేశారు.