హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం ఇందిరానగర్‌లో ఉన్న టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. గమనించిన కాదమంచి అపార్ట్‌మెంటువాసులు సమాచారం ఇవ్వగా... అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఎంతకీ అదుపులోకి రాకపోవటం వల్ల... జేసీబీలతో గోదాంను కూల్చి మంటలు ఆర్పారు. జనావాసాల మధ్యనున్న గోదాంను తొలగించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.
ఉవ్వెత్తున ఎగిసిన మంటలు... విద్యుదాఘాతమే కారణం!
వనస్థలిపురం ఇందిరానగర్‌లోని టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మంటల దాటికి కాదమంచి అపార్ట్‌మెంటు అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు వెంటనే అపార్ట్‌మెంటువాసుల్ని ఖాళీ చేయించారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో కలిసి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. గోదాం యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాధకరమైన గోదాంలు ఏర్పాటు చేయకుండా జీహెచ్‌ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: విషాదం: అంబులెన్స్ కింద పడి యువకుడు మృతి...
TAGGED:
fire accident in tyre godown