ఇదీ చదవండి:
లోకేశ్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు - nara lokesh latest arrest news
గుంటూరు జిల్లా ఖాజా టోల్‌ప్లాజా దగ్గర తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మరో నేత కళా వెంకట్రావులను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేస్తున్నాం అంటూ లోకేశ్‌కు నోటీసులు ఇచ్చారు. తను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరినీ రెచ్చగొట్టేందుకు యత్నించలేదని పోలీసులకు లోకేశ్ తెలిపారు. ఒంగోలు పర్యటనకు వెళ్లి వస్తున్నానని లోకేశ్ చెప్పగా.. ఆయన్ను అదుపులోకి తీసుకొని... ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. లోకేశ్, కళా వెంకట్రావును గృహనిర్బంధం చేశారు.
లోకేశ్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు