కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతులు బారులు తీరి ఉండేవారని... తెరాస హయాంలో ఆ సమస్యే లేదన్నారు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. తెలంగాణ భవన్లో వేములవాడకు చెందిన కాపులు.. ఆయన సమక్షంలో కారెక్కారు. ఎరువుల బస్తాలను పోలీస్‌స్టేషన్లలో ఉంచి పంపిణీ చేసిన చరిత్ర గత ప్రభుత్వాలదని గుర్తు చేశారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పంటలకు మద్దతు ధర దక్కేందుకు సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఈనెల 11న జరిగే ఎన్నికలు రాష్ట్ర, దేశ గతిని మార్చేవిగా కేటీఆర్ అభివర్ణించారు.
జై కిసాన్ నినాదం కాదు మా విధానం: కేటీఆర్
జై కిసాన్ నినాదం కాదు... మా విధానం. మా హయాంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చాం... ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం... పంటలకు మద్దతు ధర కోసం కృషిచేస్తున్నాం: కేటీఆర్
కేటీఆర్