తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 1:02 PM IST

Updated : Jun 28, 2020, 1:36 PM IST

ETV Bharat / city

'పీవీ పేరిట పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలి'

జులై 28లోగా పీవీ జ్ఞానభూమిలో స్మారకం ఏర్పాటు కావాలని సీఎం కేసీఆర్​ సూచించారు. పీవీ రచనలు పునఃముద్రణ జరగాలన్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలకు పీవీ పేరు పెట్టాలని కోరారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్​ పాల్గొని ప్రసంగించారు.

kcr-said-pv-narasimha-rao-postal-stamp-will-be-release
'పీవీ పేరిట పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలి'

పీవీ రచనలు వంద శాతం సాహిత్య అకాడమీ ద్వారా ముద్రిస్తామని సీఎం కేసీఆర్​ అన్నారు. పీవీ రచనలను విశ్వవిద్యాలయాలకు పంపుతామన్నారు. పీవీ రచనలను అనేక భాషల్లో ముద్రిస్తామని పేర్కొన్నారు. పీవీ కాంస్య విగ్రహాలు ఐదు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వంగర, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, తెలంగాణ భవన్‌లో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.

పార్లమెంటులోనూ పీవీ చిత్రపటం

అసెంబ్లీలో శాశ్వతంగా పీవీ చిత్రపటం ఉండేలా చూస్తామని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులోనూ పీవీ నరసింహారావు చిత్రపటం ఉండాలని ఆయన కోరారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేస్తామన్నారు. ముఖ్యులతో కలిసి వెళ్లి పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధానిని కోరుతామన్నారు. పీవీ పేరుతో కాకతీయ వర్సిటీలో రీసెర్చ్‌ కేంద్రం పెడతామని కేసీఆర్​ తెలిపారు.

జ్ఞానభూమిలో స్మారకం

ప్రజలు కోరితే తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతామని సీఎం పేర్కొన్నారు. పీవీ జ్ఞానభూమిలో స్మారకం ఏర్పాటు చేస్తామన్నారు. రామేశ్వరంలో అబ్దుల్‌ కలామ్‌ స్మారకం మాదిరిగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీవీ జయంతి ఉత్సవాల కమిటీ రామేశ్వరం సందర్శిస్తుందని వెల్లడించారు. పీవీ పేరిట పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలని కేశవరావు సూచించారు. హెచ్‌సీయూకు పీవీ పేరు విషయమై ప్రధానికి లేఖ రాస్తామని కేసీఆర్​ అన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్​ పాల్గొని ప్రసంగించారు.

ఇదీ చూడండి :మా నాన్నది భాషకు అందని వ్యక్తిత్వం: పీవీ కుమార్తె

Last Updated : Jun 28, 2020, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details