జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘భారతదేశంలోనే గొప్ప చారిత్రక నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో నలుమూలల నుంచి ఎవరొచ్చినా అక్కున చేర్చుకున్న నగరం హైదరాబాద్. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కాస్మోపాలిటన్ సిటీగా మారింది. తెరాస ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు అర్థం చేసుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. పేదలు, ధనికులను సమదృష్టితో చూసే ప్రభుత్వం మాది’’ అని సీఎం వివరించారు.
గృహవినియోగదారులకు ఉచితంగా నీటి సరఫరా: కేసీఆర్ - cm kcr
నెలకు 20 వేల లీటర్ల లోపు నల్లా వినియోగించే గృహవినియోగదారులకు ఉచితంగా నీటి సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. డిసెంబర్ నుంచే ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు.
గృహవినియోగదారులకు ఉచితంగా నీటి సరఫరా: కేసీఆర్
ఈ ఏడాది డిసెంబరు నుంచి 20వేల లీటర్ల వరకు ప్రజలు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం ప్రకటించారు. దాదాపు 97 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి కూడా నీటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజలు కూడా నీటి దుబారా తగ్గించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
‘గ్రేటర్’ ఎన్నికల వరాలు..
- రాష్ట్రవ్యాప్తంగా లాండ్రీలు, దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్
- కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు
- పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్ ఛార్జీల మినహాయింపు
- రూ. 10కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్ సహాయం. మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ తరహాలో టిక్కెట్ల ధరలు సవరించుకునే వెసులుబాటు.
ఇవీ చూడండి: ఎన్నికల ప్రచారంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ
Last Updated : Nov 23, 2020, 3:26 PM IST