శాసనమండలి రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం
10:14 January 27
శాసనమండలి రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాసేపట్లో ఇందుకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు. గత కొన్ని రోజులుగా ఉభయసభల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో ఆగ్రహం చెందిన వైకాపా సర్కారు... శాసనమండలిని రద్దు చేసేందుకే మొగ్గుచూపింది. మండలిలో మెజారిటీ లేకపోవటంతో శాసనసభలో ఆమోదించిన బిల్లులు కౌన్సిల్లో ఆమోదం పొందలేకపోతున్నాయి. బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేశారు.