తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర బలగాల భద్రత మధ్య మేఘ గ్రూప్​లో ఐటీ సోదాలు

ప్రముఖ గుత్తేదారు, మేఘ గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, గ్రూపు ఎండీ పీపీ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజు కూడా ఐటీ శాఖ తనిఖీలు కొనసాగాయి. కేంద్ర బలగాల భద్రత మధ్య మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.

మేఘ సంస్థలో ఐటీ సోదాలు

By

Published : Oct 14, 2019, 9:13 AM IST

మూడ్రోజులుగా మేఘ గ్రూప్​ అధినేత కృష్ణారెడ్డి, సంస్థ ఎండీ పీపీ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాల భద్రత మధ్య ఐటీ అధికారులు సోదాలు నిర్వహించాయి. సాధారణంగా భద్రతాపరంగా ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయని ఐటీ అధికారులు భావిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి సహకారం తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడైన మేఘ కృష్ణారెడ్డి ఇంట్లో సోదాలు కావడం వల్ల.. ఐటీ ఇన్వెస్టిగేషన్‌ విభాగం ముందుజాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మేఘ సంస్థలో ఐటీ సోదాలు

ఏడాదికి రూ.20 వేల కోట్ల టర్నోవర్

వివిధ రాష్ట్రాల్లో పవర్‌ ప్రాజెక్టులు, విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులు, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు, తెలంగాణాలో మిషన్‌ భగీరథ లాంటి కాంట్రాక్ట్‌లను ఈ సంస్థనే చేపట్టింది. ఏడాదికి 20వేల కోట్లకుపైగా టర్నోవర్‌ కలిగిన మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌-ఎంఇఐఎల్‌కు దేశవ్యాప్తంగా 17 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉంది.

మూడ్రోజులుగా సాగుతోంది

ఈ నెల 11న ప్రధాన కార్యాలయం, ఇళ్లు, కార్యాలయాలు, అతిథి గృహం తదితర స్థావరాలపై ఏకకాలంలో ప్రారంభమైన దాడులు మూడ్రోజులుగా సాగుతున్నాయి. అధికారులు కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details