తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతర్​ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్ట్

విశాఖపట్నం​ నుంచి హైదరాబాద్, నిజామాబాద్​కు గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎల్​బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు.

అంతర్​ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్ట్

By

Published : Oct 23, 2019, 5:00 PM IST

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా గుట్టురట్టైంది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 80 కిలోల గంజాయి, ఒక స్విఫ్ట్​ కారు, రూ.4,200 నగదు, 4 చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నేరేడ్‌మెట్‌లోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ గంజాయి స్మగ్లర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.15.20 లక్షలుగా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. సూర్యాపేటలో ఉండే నలుగురు స్నేహితులు కలిసి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే సమాచారం అందిందన్నారు. విశ్వసనీయమైన సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లు సీపీ వివరించారు.

అంతర్​ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details