సికింద్రాబాద్ బేగంపేట్ పీఎస్ పరిధిలోని ఇందిరమ్మ నగర్లో విషాదం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ నగర్లో నివాసం ఉంటున్న వెంకటేష్‌కు స్వప్నతో మూడు నెలల క్రితం రెండో వివాహం జరిగింది. వెంకటేష్‌కు 15 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆమె మరణించడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యను మర్చిపోలేక వెంకటేష్ తరచూ స్వప్నతో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. మొదటి భార్య కారణం వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి.. ఈరోజు ఉదయం ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్వప్న మెడకు తాడును గట్టిగా బిగించి రోకలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మొహానికి. తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల అక్కడికక్కడే మరణించింది. ఆందోళనకు గురైన వెంకటేష్ తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య భర్తల మరణంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు వారి మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చూడండి: ఒకరు చెరువులో.. మరొకరు కాలువలో...