తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2021, 3:42 PM IST

Updated : Sep 23, 2021, 5:18 PM IST

ETV Bharat / city

ICET results 2021: ఐసెట్‌ ఫలితాలు విడుదల.. 90.09 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత

icet-results-2021-telangana-released-by-limbadri
icet-results-2021-telangana-released-by-limbadri

15:39 September 23

ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి

రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 90.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి వెల్లడించారు. ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్‌కు మొదటి ర్యాంకు రాగా.. సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు 9 మంది ఉండగా.. కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థి ఆనంద్‌పాల్‌ ఐదో ర్యాంకు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో ఆరు ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకుని తమ సత్తా చాటారు.

ఐసెట్‌ ఫలితాల్లో మొదటి పది ర్యాంకర్లు...

  1. మొదటి ర్యాంకు- లోకేశ్‌ (హైదరాబాద్‌)
  2. రెండో ర్యాంకు- సాయి తనూజ (హైదరాబాద్‌)
  3. మూడో ర్యాంకు- నవీనక్షంత (మేడ్చల్‌)
  4. నాలుగో ర్యాంకు- రాజశేఖర చక్రవర్తి (మేడ్చల్‌)
  5. ఐదో ర్యాంకు- ఆనంద్‌పాల్‌(కృష్ణా జిల్లా)
  6. ఆరో ర్యాంకు- శ్రీచరిత (నల్గొండ)
  7. ఏడో ర్యాంకు- అఖిల్‌ (మేడ్చల్‌)
  8. ఎనిమిదో ర్యాంకు- మిథిలేష్‌ (జగిత్యాల)
  9. తొమ్మిదో ర్యాంకు- నికితైశ్వర్య (హైదరాబాద్‌)
  10. పదో ర్యాంకు- అరుణ్‌కుమార్‌ (వరంగల్‌)

 

ఫలితాల కోసం క్లిక్​ చేయండి:ICET RESULTS 2021

Last Updated : Sep 23, 2021, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details