తెలంగాణ

telangana

ETV Bharat / city

కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం! - వెంగలరాయ సాగర్‌ వద్ద బయటపడిన అస్థిపంజరం

స్పైడర్​ సినిమాలో సైకో విలన్​ మనుషుల్ని చంపేసి.. వారి శవాల్ని కాంక్రీటు పిల్లర్లలో పడేస్తాడు గుర్తుందా..! అలాంటి సంఘటనే ఇప్పుడూ జరిగింది. ఓ జలాశయ తూములో మనిషి అస్థిపంజరం బయటపడింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

human-skeleton-find-into-the-concrete-pillar-at-sambara-village-vengaraya-sagar-dam-in-vizianagaram
కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం!

By

Published : Apr 26, 2020, 8:53 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామ సమీపంలోని వెంగలరాయ సాగర్‌ వద్ద... మానవ అస్థిపంజరం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాశయం ఎడమ కాల్వ తూములో మనిషి పుర్రె, కాలిన ఎముకలు బయటకు కన్పించాయి. అస్థిపంజరానికి సంబంధించిన మరికొంత భాగం గుడ్డలో కట్టి ఉంది.

తూము కాంక్రీటు శిథిలమైన కారణంగా... అందులో నుంచి ఎముకలు కన్పిస్తున్నాయి. జలాశయం నిర్మాణం జరిగిన సమయంలో మృతి చెందిన వారిని కాంక్రీటులో కలిపి పూడ్చివేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు స్పందించాల్సి ఉంది.

కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం!

ఇవీ చూడండి: ఓట్లకోసం లక్షలు పంచుతాం కానీ.. కష్టకాలంలో ఆదుకోండి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details