తెలంగాణ

telangana

ETV Bharat / city

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ - తెలంగాణ పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

mlc elections
mlc elections

By

Published : Sep 22, 2020, 7:09 PM IST

Updated : Sep 22, 2020, 7:48 PM IST

19:07 September 22

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

    వచ్చే ఏడాది ఖాళీ కానున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. మార్చి 29తో మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎస్.రామచందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది.  

     ఖాళీ అయ్యే స్థానాల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోన్న ఈసీ... సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ప్రారంభించనుంది. ఓటర్ల జాబితా తయారీ కోసం అక్టోబర్ 1న బహిరంగ నోటీసు ఇస్తారు. ఓటరు నమోదు కోసం దరఖాస్తులకు నవంబర్ 6 వరకు గడువిస్తారు.  

     డిసెంబర్ 1 న ఓటర్ల జాబితా ముసాయిదాను  ప్రచురిస్తారు. దీనిపై డిసెంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి 2021 జనవరి 1న ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు.  

ఇదీ చదవండి :రూ.40 లక్షలు ఎక్కడ దాచారనే విషయంపై అనిశా ఆరా

Last Updated : Sep 22, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details