తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీలో ఏముందంటే.. - జీఎన్ రావు కమిటీ నివేదక వార్తలు

ఏపీ అభివృద్ధి ఏ విధంగా ఉండాలి.. రాజధాని ఎలా ఉండాలనే అంశాలపై తమ కమిటీ అధ్యయనం చేసిందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు తెలిపారు. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై ఆ రాష్ట్ర  సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ సభ్యులు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

gn-rao-commite-report-submit-to-the-governament
ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీ

By

Published : Dec 20, 2019, 7:34 PM IST

Updated : Dec 20, 2019, 8:01 PM IST

ఏపీ అభివృద్ధితో పాటు రాజధాని అంశంపై ప్రభుత్వం నియమించిన జీఎన్​ రావు కమిటీ.. తమ నివేదికను ఆ రాష్ట్ర సీఎం జగన్​కు అందజేసింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సభ్యులు.. నివేదికకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

సహజ వనరుల, పర్యావరణానికి అనుగుణంగా

ఆంధ్రప్రదేశ్​లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని నిపుణుల కమిటీ తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సుమారు 38 వేలకుపైగా సూచనలు వచ్చాయని తెలిపారు. రెండు అంశాల ఆధారంగా నివేదిక రూపొందించామని కమిటీ తెలిపింది. సహజ వనరులు, పర్యావరణానికి అనుగుణంగా సూచనలు ఇచ్చామని స్పష్టం చేసింది. సహజ వనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించేలా అధ్యయనం చేశామని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ఆయా ప్రాంతాల్లో ఎలా మౌలిక వనరుల అభివృద్ధి అవుతాయనే అనే కోణంలో అధ్యయనం సాగిందని తెలిపారు.

నిపుణుల కమిటీ వెల్లడించిన ముఖ్యాంశాలు

  • నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు సిఫార్సు
  • ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమగా విభజన
  • శాసన రాజధానిగా అమరావతి
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో పాటు అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
  • విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం

మరింత అభివృద్ధి చేయవచ్చు..

తుళ్లూరు ప్రాంతాన్నిఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చేసిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ప్రాంతాన్ని వివిధ శాఖలకు వినియోగించుకోవచ్చని సూచించామని అన్నారు. అమరావతిలో రైతులకు అందాల్సిన ప్లాట్లును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు.

రాజధాని ఏది అన్న ప్రశ్నపై..

రాజధాని ఏదీ అన్న ప్రశ్నకు నిపుణుల కమిటీ స్పష్టం చేయలేదు. రాజధాని ఏది అని చెప్పడం తమ పని కాదని కమిటీ తెలిపింది. కేవలం ప్రభుత్వానికి సూచనలు ఇచ్చామని...తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీ

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

Last Updated : Dec 20, 2019, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details