ఎర్లీ బర్డ్ విధానంతో జీహెచ్ఎంసీకి రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలయింది. ఏప్రిల్లో 742.41 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు కావడం విశేషం. నిన్న(ఏప్రిల్ 30) ఒక్క రోజే 96.34 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలయింది. ఈ నెల రోజుల్లో పన్ను చెల్లించిన వారికి 5 శాతం జీహెచ్‌ఎంసీ రీబెట్ ఇచ్చింది.
గతేడాది మొత్తం కూడా 1495 కోట్ల రూపాయలే వసూలు కాగా.. ఈ ఏడాది మాత్రం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఒక్కనెలలోనే పెద్ద ఎత్తున పన్ను వసూలు కావడం రికార్డని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది మొత్తం వసూళ్లలో దాదాపు సగం కలెక్షన్ ఈ ఒక్క నెలలోనే వసూలయింది. నిన్న అర్ధరాత్రితో ఎర్లీ బర్డ్ ముగిసింది.