రాజధాని నగరంలో జనాభా 20 లక్షల ఉన్న సమయంలో గాంధీ, ఉస్మానియాతోపాటు మరికొన్ని ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జనాభా కోటి దాటింది. ఈ లెక్కన ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య మరిన్ని భారీగా పెరగాల్సి ఉంది. మొదటి దశలో కరోనా విజృంభించిన వేళ ఏడాదిన్నర కిందట రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఇక్కడ వెయ్యిపడకలతో సూపర్‌స్పెషాల్టీ వైద్యం అందించాలని సర్కార్ భావించింది. కానీ ఇంకా అక్కడ పూర్తి ఏర్పాట్లు కాలేదు. మొదటి, రెండో దశ కరోనా సమయాల్లో కూడా ఇక్కడ వేలాదిమంది కరోనా రోగులకు చికిత్స అందించారు. టిమ్స్‌కు అనుబంధంగా మరో మూడు దవాఖానాలు మూడు దిక్కులా ఒక్కో దాంట్లో వెయ్యి పడకలు ఉండేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల కిందట అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇలా పిలుస్తారు..
కొత్తగా నిర్మించనున్న దవాఖానాలన్నింటినీ టిమ్స్ పరిధిలోకి తెచ్చారు. చెస్టు ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే దవాఖానాను సనత్‌నగర్ టిమ్స్‌గా పిలుస్తారు. అలాగే ఎల్బీనగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ అని పిలవాలని నిర్ణయించారు. ప్రతి ఆసుపత్రిని ఓ సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఉదాహరణకు సనత్‌నగర్ టిమ్స్‌ను గుండెలు, అల్వాల్ టిమ్స్‌ను నరాల స్పెషాల్టీగా తీర్చిదిద్దాలని అనుకున్నా కూడా అక్కడ ఇతర రోగాలకు సంబంధించి విభాగాలను ఏర్పాటు చేస్తారు.
పఠాన్‌చెరులో 250 పడకలతో..