తెలంగాణ

telangana

ETV Bharat / city

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని జంపనీలో చోటుచేసుకుంది.

Breaking News

By

Published : Dec 28, 2020, 4:26 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా జంపనిలో అప్పుల బాధలు తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకున్న శ్రీనివాసరావు.. 4 ఎకరాల్లో నిమ్మతోట, 3 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నాడు.

రెండేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్తాపంతో శ్రీనివాసరావు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​గా సునీతా లక్ష్మారెడ్డి

ABOUT THE AUTHOR

...view details