తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2021, 10:46 PM IST

ETV Bharat / city

అడవిలో అంటుకున్న మంటలు.. భారీగా వృక్షసంపద దగ్ధం

ఏపీ కడప జిల్లా వెలుగొండ అడవులకు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల కార్చిచ్చు వ్యాపించింది. అడవిలోని జంతుజాలం, విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతవడం వల్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

forest
భారీగా వృక్షసంపద దగ్ధం

భారీగా వృక్షసంపద దగ్ధం

ఏపీ కడప జిల్లా చిట్వేలు మండలంలోని రాపూరు- చిట్వేల్ రహదారిలో వెలుగొండ అడవి అగ్నికి ఆహుతైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిట్వేల్-రాపూరు రహదారిలో వెలిగొండల్లో భారీగా కార్చిచ్చు ప్రబలి అడవి దహించుకుపోతోంది. ఎంతో విలువైన ఎర్రచందనంతో పాటు వృక్షసంపద, జంతుజాలం అగ్నికి ఆహుతయ్యాయి.

రహదారి గుండా పోయే గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గత ఐదారు నెలల నుంచి భారీ వర్షాలు పడగా.. అడవి పచ్చని చెట్లతో కళకళ లాడుతున్న సమయంలో ఇలా జరగడం పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:'అత్యవసరమైతేనే బయటకి రండి.. కరోనా వస్తే బెడ్లు దొరకవు'

ABOUT THE AUTHOR

...view details