తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్మికులు, యాచకులకు ఆహారం పంపిణీ

లాక్​డౌన్​ సమయంలో చాలా మంది కార్మికులు, యాచకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి ఆకలి కేకలు అర్థం చేసుకున్న చాలా మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా భోజనం పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమం సాగుతుందని పలువురు తెలిపారు.

Food Distribution
కార్మికులు, యాచకులకు ఆహారం పంపిణీ

By

Published : Mar 28, 2020, 1:41 PM IST

Updated : Mar 28, 2020, 3:07 PM IST

లాక్‌డౌన్​తో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మూతపడ్డాయి. చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికి పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూసివేశారు. ఫలితంగా యాచకులు, రహదారుల పక్కన జీవనం సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కార్మికులు, యాచకులకు ఆహారం పంపిణీ

ఇది గమనించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముందు, ఫుట్‌పాత్‌లు..రహదారుల పక్కనున్న కార్మికులు, యాచకులకు ఆహార పొట్లాలు, బ్రెడ్, అరటి పండ్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమం సాగుతుందని సభ్యులు తెలిపారు.

ఇవీ చూడండి:బాధను దిగమింగుకుంటూ... కొడుకు శవాన్ని మోసుకుంటూ...

Last Updated : Mar 28, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details