లాక్‌డౌన్ తర్వాత భాగ్యనగర భోజన ప్రియుల కోసం సబ్జీమండి గంగపుత్ర సంఘం భవనంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఫుడ్ మేళా చేపట్టినట్లు మత్స్యసహకార సంఘం అధ్యక్షురాలు శోభ బెస్త వెల్లడించారు.
సబ్జీమండి గంగపుత్ర భవనంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని సబ్జీమండి గంగపుత్ర సంఘం భవనంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు గంగపుత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు జీ. విద్య బెస్త తెలిపారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వివిధ చేపల వంటకాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.
సబ్జీమండి గంగపుత్ర భవనంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
పెద్ద ఎత్తున ప్రజలు స్టాళ్లను సందర్శించి మహిళల ఆర్థిక స్వాలంబనకు కృషి చేయాలని విద్య సూచించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు వంటకాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. హైదరాబాద్ మహానగర వాసులు గంగపుత్ర వారి చేపల రుచులు ఆస్వాదించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ గంగపుత్ర మహిళా సభ ప్రెసిడెంట్ అరుణ జ్యోతి బెస్త కోరారు. కార్యక్రమంలో సబ్జీమండి మహిళా సంఘం, మహిళా సభ నేతలు పాల్గొన్నారు.