తెలంగాణ

telangana

ETV Bharat / city

నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు అగ్నిమాపక శాఖ సన్నద్ధం

వర్షకాలం వచ్చిదంటే చాలు.... వరదలు, ముంపు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కాలనీలు, బస్తీలు జలదిగ్భందంలో చిక్కుకుని నగర, పట్టణాల ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిని సవాల్‌గా తీసుకుని ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖ సిద్దమవుతోంది. నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు.

Fire Department
Fire Department

By

Published : Jul 14, 2021, 5:13 AM IST

వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. ఎటువైపు నుంచి వరద ముంచెత్తుతుందోనని భయ నెలకొంటోంది. వర్షం తగ్గుముఖం పట్టేదాకా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. వరద ముంపు వంటి విపత్తులు ఎదురైనప్పుడు నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు అగ్నిమాపక శాక సన్నద్దమవుతోంది. అత్యవసర సమయాల్లో నీటిలో ఈదడం దగ్గర నుంచి పడవలు నడపడం వరకు అగ్నిమాపక సిబ్బంది, అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తోంది.


నీటి ప్రవాహానికి ఎలా ఎదురెళ్లి..

సిబ్బందికి ఎక్కవ సేపు నీటిలో ఈదడం, వరదలో చిక్కుకున్న వారిని తాళ్లు, ట్యూబ్‌ల సాయంతో ఎలా బయటకు తీసుకురావాలనే అంశాల్లో శిక్షణనిస్తున్నారు. భారీ నీటి ప్రవాహానికి ఎలా ఎదురెళ్లాలో నిపుణులైన శిక్షకులు, అధికారులు, సిబ్బందికి తర్ఫీదు ఇస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ఒక్కో అగ్నిమాపక కేంద్రం నుంచి ముగ్గురు చొప్పున దాదాపు 250 మందికి శిక్షణ ఇచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మరిన్ని అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.

నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు అగ్నిమాపక శాఖ సన్నద్ధం

మన జీహెచ్​ఎంసీలో చాలా వరద వచ్చింది. వేరే జిల్లాల్లో కూడా చాలా వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఒక వ్యక్తిని కాపాడటం కొంచెం ఇబ్బంది అయింది. దాన్ని ఓవర్ కమ్ చేయడానికని మా డిపార్ట్​మెంట్ వాళ్లందరికి బేసిక్ బోట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. బేసిన్ టెక్నిక్ ఏంటి? ఒక ఫైర్ సిబ్బంది కానీ, ఒక ఎస్​ఎఫ్​ఓ కానీ, ఏ టెక్నిక్​తో ఒక వ్యక్తిని ఎలా రెస్యూ చేయాలనేది ఇందులో భాగంగా నేర్పిస్తున్నాం. బోటు ఎలా డ్రైవ్ చేయాలి, ఒక వ్యక్తిని ఎలా కాపాడాలి, ఒక వ్కక్తి వరదలో మధ్యలో దూరంగా ఉన్నప్పుడు అతడ్ని ఎలా కాపాడాలి, ఎలా అతని దగ్గరకు వెళ్లాలి, ఏ సైడ్​ నుంచి బోటులోకి ఆ వ్యక్తిని కాపాడాలి అనే విషయాలు ఇవాళ చెప్పడం జరిగింది. - జయకృష్ణ, యాదాద్రి అగ్నిమాపక అధికారి.

స్విమ్మింగ్​లో టెక్నిక్​ నేర్పడం, ఎక్కువ సేపు ఈదడం ఎలా?, ఒక వ్యక్తి ఎవరైనా వాటర్​లో పడిపోతే కాపాడటం ఎలాగ? బాధితుల దగ్గరకు మనం వెళ్లినప్పుడు వాళ్లు మనల్ని గట్టిగా పట్టుకోవడం వల్ల మనకు జరిగే రిస్క్​ ఎంటి? అవన్ని మాకు కొన్ని టెక్నిక్స్​ చెప్పారు. వెట్​ రెస్కూ ఎలా చేయాలి? రోప్స్​ ఎలా వాడాలి? లైఫ్​ బోట్స్ ఎలా వాడాలి? అని ఇవన్ని స్టేట్​ ట్రైనింగ్ సెంటర్​లో ఉన్న స్విమ్మింగ్ పూల్​లో శిక్షణ ఇవ్వడం జరిగింది. వేవ్​ వస్తే ఎలా వెళ్లాలి? ఫ్లడ్స్ వస్తే వాటినిదాటి ఎలా వెళ్లాలి? ట్యూబ్​లను లోపల వేసి బాధితులను ఎలా కాపాడాలి? అనే విషయాలు ట్రైనర్స్ ద్వారా నేర్పించారు. - శ్యాంసుందర్ రెడ్డి, నల్గొండ.

ఈ శిక్షణ ప్రయోజనకరంగా ఉందని సిబ్బంది చెబుతున్నారు. వరదల విపత్తు సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని బాధితులను కాపాడతామనే భరోసా నింపిందని హర్షం వ్యక్తం చేశారు. జలప్రళయాల సమయంలో బాధితులను రక్షించడంతో పాటు తమను తాము ఎలా కాపాడుకోవాలో తర్ఫీదునిచ్చామని శిక్షకులు తెలిపారు.

డేంజర్​లోకి వెళ్లినప్పుడు వాళ్లకే మొదటి ప్రమాదం. డేంజర్​లోకి వెళ్లినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలి. ఎలా కాపాడటానికి ప్రయత్నించాలి. మినిమంమ్ డ్యామెజ్​తో ఎక్కువ మందిని ఎలా బయటకు తీసుకురావాలి అనేది మేము నేర్పిస్తున్నాం. ఇందతా బేసిక్ టెక్నిక్​లు. ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ సిబ్బందికి ఇదొ కమాండో శిక్షణ లాంటిదనే చెప్పాలి. - జాకోబ్​ విజయ్​కుమార్, శిక్షకుడు

ఇవీ చూడండి:Hyderabad rains: తడిసిముద్దైన భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details