న్యాయవాదుల హత్య కేసు... ఎఫ్ఐఆర్లో ఆ ముగ్గురి పేర్లు - telangana crime news
12:37 February 18
వామన్‌రావు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మృతుడు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదుతో ముగ్గురిపై కుట్ర, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు.. ఏ1 గా వెల్ది వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్‌ను చేర్చారు. ఐపీసీ 120బి, 302, 341, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద బుధవారం రోజు వామన్‌రావు దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి కల్వచర్ల చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరించింది.
- ఇదీ చూడండి :న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు