తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్‌ వినియోగంలో పాత పంథానే! - Electricity arrears in Telangana

వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్ బ్యాంకులతో విద్యుత్ పొదుపు సాధ్యమవుతుందని చెప్పినా.. సరైనా స్పందన లేదు. యాసంగిలో సాగు విస్తీర్ణంతో పాటు బోర్ల వినియోగమూ పెరగనున్నందున.. కెపాసిటర్ బ్యాంకులపై రైతులు దృష్టి సారించాలని.. లేనియెడల అధిక విద్యుత్ భారం ప్రభుత్వంపై పడుతోందని అధికారులు చెబుతున్నారు.

Capacitor banks for agricultural motors in Telangana
విద్యుత్‌ వినియోగంలో పాత పంథానే!

By

Published : Feb 14, 2021, 9:47 AM IST

వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్‌ బ్యాంకులను తప్పక వినియోగించాలని, తద్వారా విద్యుత్తు పొదుపు సాధ్యమవుతుందని విద్యుత్తు పంపిణీ సంస్థలు ప్రచారం చేస్తున్నా ఆశించిన స్పందన లేదు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 26 లక్షల మోటార్లుండగా, కెపాసిటర్లు బిగించినవి ఒక్క శాతమూ లేకపోవటం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. మరోవైపు అధిక విద్యుత్తు వినియోగంతో సర్కారుపై బిల్లుల భారం పడుతోంది. యాసంగిలో సాగు విస్తీర్ణంతో పాటు బోర్ల వినియోగమూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కెపాసిటర్‌ బ్యాంకులపై రైతులు దృష్టిపెట్టాల్సి ఉంది. 5 హెచ్‌పీ మోటారుకు కెపాసిటరును బిగిస్తే 5శాతం వరకూ విద్యుత్‌ పొదుపు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

మోటార్ల వినియోగంలో నిపుణుల సూచనలు..

* రైతులు త్రీఫేజ్‌ మోటారు స్టార్టర్ల దగ్గర కెపాసిటర్లను బిగించుకుంటే వోల్టోజీ పెరుగుతుంది. విద్యుత్‌ వినియోగం తగ్గి, పంపుసెట్టు జీవితకాలం పెరుగుతుంది

* పీవీసీ పైపులైను వాడితే ఎక్కువ విద్యుత్తు విడుదలవుతుంది

* డెలివరీ లైన్లలో, సక్షన్‌లో, ఎక్కువ జాయింట్లు, బెండ్లు (వంపులు) లేకుండా చూసుకోవాలి

* తక్కువ నిరోధకశక్తిగల ఫుట్‌వాల్వును వాడాలి

* పంపుసెట్ల తయారీదారు సూచించినట్లుగా లూబ్రికేట్‌ చేయాలి

* తక్కువ నీటి వినియోగానికి వీలుగా రైతు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి

నాణ్యమైన మోటార్లు వాడాలి

రైతులు వాడుతున్న మోటార్లు ఐదారు గంటలపాటు నిలకడగా పనిచేసేలా తయారయినవి మాత్రమే పైగా చాలామంది వాడుతున్నవి మోటార్లు స్థానిక ఉత్పత్తులే. వాటి నాణ్యత అంతంతే.. 5 హెచ్‌పీ అని చెప్పినా, వాటిల్లో ఎక్కువ భాగం 6.5 హెచ్‌పీవి అయ్యుంటాయి.

- శ్రీనివాస్‌, ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌, ఆపరేషన్స్‌

* పవర్‌ ఫ్యాక్టర్‌, వోల్టేజిలను మెరుగుపరచటానికి ఐఎస్‌ఐ మార్కు షంట్‌ కెపాసిటర్లనే వాడాలి

* సరైన పంపుసెట్ల వినియోగంతో విద్యుత్‌ సామర్థ్యం 25 నుంచి 35 శాతం పెరుగుతుంది

* రైతులంతా డీఎస్‌ఎం(డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ మేనేజిమెంట్‌) విధానాన్ని అనుసరించాలి

* నీటి విడుదల చేసే పైపులైనును తక్కువ ఎత్తులో నిర్మించాలి. 2 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే, ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది

* పంటల సాగులో నీటి వృథాను అరికట్టాలి. ఉదాహరణకు వరి పొలంలోకి ఎక్కువ నీటిని వదిలితే పిలకలు వచ్చి దిగుబడి తగ్గుతుంది.

ABOUT THE AUTHOR

...view details