తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2020, 9:25 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌@ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHRAT TOP TEN 9PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌@ 9PM

1. బ్యాంకు ఉద్యోగిపై.. దానం దౌర్జన్యం!

బ్యాంకు ఉద్యోగిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం వ్యవహరించిన తీరు చర్చనీయాశమైంది. బ్యాంకులో లోన్​ తీసుకొని తిరిగి రుణం చెల్లించని ఓ మహిళకు చెందిన భూమిని వేలం వేసి.. ఖైరతాబాద్​లోని ఆ స్థలం చుట్టూ కంచె వేసేందుకు వచ్చిన బ్యాంకు ఉద్యోగుల పట్ల దానం, ఆయన అనుచరులు బెదిరిస్తూ దుర్భాషలాడుతూ నెట్టివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. హైదరాబాద్‌ మేయర్​‌కు కరోనా పాజిటివ్

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్ నిర్ధరణయింది. శనివారం మేయర్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ మేయర్ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'కుతంత్రాలను సైనికులు ఛేదిస్తారు'

కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో చైనా కుట్ర కుతంత్రాలను భారత సైనికులు ఛేదిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. కార్గిల్ విజయాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. వరదలో కారు- కాపాడిన జనం

కర్ణాటక కలబురిగి జిల్లా బడదల గ్రామం వద్ద కాలువలో కొట్టుకుపోతున్న ఓ కారులోని ఐదుగురిని రక్షించారు స్థానికులు. ఏకంగా కారుకు తాడు కట్టి ప్రాణాలకు తెగించి కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. వరదలో పురిటి నొప్పులు

బిహార్​లో సహాయక దళాల పడవలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఇంటి నిండా వరద నీరు చేరి పురిటి నొప్పులతో తల్లడిల్లిన గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. పడవలోనే ప్రసవించిన ఆ తల్లి, బిడ్డలు ప్రస్తుతం ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా?

' కార్గిల్​ విజయ్‌ దివస్'‌ సందర్భంగా భారత సైన్యం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆనాటి యుద్ధ ఘట్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'భాజపా కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'

రాజ్యాంగానికి , ప్రజాగళానికి అనుగుణంగా భారత ప్రజాస్వామ్యం నడుస్తుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. భాజపా మోసపూరిత కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్​ నిర్వహిస్తున్న 'స్పీకప్​ఫర్​డెమోక్రసీ' ఆన్​లైన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రికవరీలో రికార్డు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36వేల 145మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఒక్క రోజులో ఇంత మంది డిశ్చార్జి అవడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఫలితంగా కొవిడ్​ రికవరీ రేటు 63.92 శాతానికి పెరిగినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. భారత్​- చైనా మధ్య ఐదో రౌండ్ చర్చలు షురూ​

సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణ కోసం భారత్- చైనా మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఐదో రౌండ్ సైనిక కమాండర్ స్థాయి చర్చలు వచ్చేవారం జరగనున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల సైనిక కమాండర్లు నాలుగుసార్లు భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మొక్కలు నాటిన మెగా బ్రదర్స్​

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, పవన్​ కల్యాణ్​ సహా దర్శకులు అనిల్​ రావిపుడి, బోయపాటి శ్రీను పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details