తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2020, 11:00 AM IST

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHRAT TOP TEN 11AM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @11AM

1. కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది. వైరస్​తో మరో 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. దేశంలో 16లక్షలు దాటిన కేసులు..

దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 16,38,871కు పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. శానిటైజర్​ తాగి తొమ్మిది మంది మృతి

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగిన ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి ముగ్గురు మరణించగా.. ఇవాళ మరో ఆరుగురు చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విమానాశ్రయంలో 3.11 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.11 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బంగరు భవితకు నారుమడి!

సుదృఢ విద్యాసౌధం అవతరింపజేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి ఆయువు పోసింది. నేల విడిచి సాము గరిడీలు చేసిన మునుపటి అరకొర యత్నాలతో పోలిస్తే ఈ విధానం ఎన్నో రెట్లు మెరుగ్గా గోచరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

అప్పుడే పాఠశాలకు వెళ్లి.. కాస్తో కూస్తో చదవడం, రాయడం నేర్చుకుంటూ సరాదాగా గడిపే వయసది. లాక్​డౌన్​ కారణంగా విద్యాసంస్థలు మూతపడటం వల్ల.. విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. రోజూ టీవీలు, మొబైల్​ గేమ్​లతో కాలక్షేపం చేయడమే కొందరి పనైంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ఇంకా ఉత్తమ ప్రదర్శన చేస్తా'

గతేడాది జరిగిన ప్రపంచకప్​లో చోటు దక్కించుకోలేకపోయాడు ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ విల్లే. కానీ మళ్లీ జట్టులోకి వచ్చిన ఇతడు ఐర్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ప్రతికూలతలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 37,802 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కరోనా కాలంలోనూ మాల్దీవులు వెళ్లొచ్చని తెలుసా?

కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టాలని ప్రపంచదేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు మాత్రం రెండో దశ కరోనా వస్తుందేమోనని ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో గ్లోబల్​ టూరిజం కొంత మేర తెరుచుకున్నా.. పర్యటనలకు వెళ్లాలంటే భారీ ఖర్చులు మోయాల్సిందేననని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'మాపై ట్రోల్స్​ చేసే వారి ఆరోగ్యం బాగుండాలి'

సోషల్​మీడియాలో తనపై, తన తండ్రి అమితాబ్​పై వస్తున్న ట్రోల్స్​పై తాజాగా స్పందించాడు బాలీవుడ్​ నటుడు అభిషేక్​ బచ్చన్​. తమపై విమర్శలు చేసే వారి ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details