తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

By

Published : Dec 10, 2020, 8:55 PM IST

top ten news
టాప్​టెన్​ న్యూస్​@9PM

1.'ఇదో మైలురాయి'

పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ చేసిన ప్రధాని.. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటు భవనం.. ఆత్మ నిర్భర్​ భారత్​ నిర్మాణానికి సాక్షిగా నిలుస్తుందని అన్నారు మోదీ. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.అభివృద్ధి శ్రీకారం

సిద్దిపేట లేకపోతే కేసీఆర్​ లేడు.. కేసీఆర్​ లేకపోతే తెలంగాణ లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట పేరులోనే ఓ బలం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.హస్తినకు కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.రిజిస్ట్రేషన్లు షురూ..

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'తెరాస కనుమరుగవటం ఖాయం'

కేసీఆర్​ తన కంటే గొప్ప నటుడని భాజపా నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. భవిష్యత్​ భాజపాదేనని ఆమె అన్నారు. కేసీఆర్​ పతనం మొదలైందని... తెరాస కనుమరుగవటం ఖాయమని విజయశాంతి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.నడ్డా కాన్వాయ్​పై దాడి

బంగాల్​ పర్యటనలో ఉన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భాజపా ఆరోపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.'నిరసనలు విరమించండి'

వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. చలికాలంలో, కరోనా పరిస్థితుల్లో నిరసనలు చేస్తున్న రైతుల గురించి ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే నిరసనలు విరమించి.. కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.ఒక్కరోజే 3 వేల మంది బలి

అమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఒక్కరోజే 3000 మందినిపైగా బలిగొంది. ఇప్పటివరకు నమోదైన రోజువారీ మరణాల్లో ఇదే అత్యధికం. మరోవైపు జపాన్​ రాజధానిలో తొలిసారిగా 600కుపైగా కొవిడ్ కేసులు​ నమోదుకావడంపై అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఖరీదైన కెప్టెన్​

ఐపీఎల్​లో ఎక్కువ మొత్తం సంపాదించిన కెప్టెన్లలో ధోనీ టాప్​ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, కోహ్లీ నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సన్నీ, హష్మీలే నా తల్లిదండ్రులు

బాలీవుడ్‌ తారలు ఇమ్రాన్‌ హష్మీ, సన్నీ లియోన్‌లు బిహార్‌లోని మీనాపుర్‌లో నివాసముంటున్నారు. వారిద్దరికి పెళ్లి కాకపోయినా.. వారికి డిగ్రీ చదివే 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇదంతా ఏంటని అవాక్కవుతున్నారా? అయితే.. ఈ కథనం చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details