తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు.

By

Published : Nov 28, 2020, 8:59 PM IST

etv bharat telugu top ten news
టాప్​టెన్​ న్యూస్​@9PM

1.కొవాగ్జిన్​ సన్నద్ధతపై..

కరోనా వ్యాక్సిన్ సన్నద్ధతలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. వ్యాక్సిన్ పనితీరు, క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. భారత్‌ బయోటెక్‌-ఐసీఎంఆర్​ సంయుక్తంగా తయారు చేస్తున్న కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలపై శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'కేంద్రానికి గజగజ'

జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా దిల్లీకి సందేశమివ్వాలని నగర ప్రజలకు కేసీఆర్​ సూచించారు. హైదరాబాద్​లో అందరం కలిసి ఉండే పరిస్థితులు ఉండాలని... అందుకోసం మేధావులు, విద్యావంతులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.'నయా నిజాం పథకం పారనివ్వొద్దు'

నిజాం రూపంలో వస్తున్న నయా నిజాం పథకం పారనివ్వకూడదని నగర ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సూచించారు. ఎంఐఎంతో కలిసి తెరాస ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.ఓటెక్కడ..?

నగర ఓటర్ల సౌకర్యార్థం బల్దియా మై జీహెచ్​ఎంసీ యాప్​ రూపొందించింది. ఓటరు స్లిప్ డౌన్​లోడ్​, పోలింగ్​ బూత్​ వివరాలను యాప్​ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఓటర్ స్లిప్​తోపాటు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్​ మ్యాప్​తో సహా వస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'కుప్పకూలడం ఖాయం'

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పలు పార్టీల నేతలు విమర్శలను పెంచారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ డివిజన్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్​ ప్రచారాన్ని వేడెక్కించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.ముంచుకొస్తున్న ముప్పు

బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. డిసెంబర్​ 1 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.'దిల్లీలోనే ఉంటాం..'

దేశ రాజధానిలోనే ఉండి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని రైతులు తేల్చిచెప్పారు. కేంద్రం దిగొచ్చేంతవరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. మరోవైపు దిల్లీ నిరసనల్లో తమ రైతులు పాల్గొనలేదని హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ వెల్లడించారు. ఆందోళనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.ట్రంప్​కు ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్ష ఫలితాలపై పోరాటం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చుక్కెదురైంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ పెన్సిల్వేనియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ట్రంప్​. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం.. ట్రంప్​ పిటిషన్​ను కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఆసీస్​కు ఎదురుదెబ్బ!

భారత్​తో రెండో వన్డేకు ఆస్ట్రేలియా క్రికెటర్​ మార్కస్​ స్టాయినిస్​ అందుబాటులో ఉండేది లేనిది అనుమానంగా మారింది. తొలి వన్డేలో బౌలింగ్​ చేస్తున్న సమయంలో ఈ ఆల్​రౌండర్​ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.'ఊపిరి ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటా'

తనకు బిడ్డ పుట్టిన వెంటనే సినిమా చిత్రీకరణలో పాల్గొంటానని తెలిపింది బాలీవుడ్​ హీరోయిన్​ అనుష్క శర్మ. తన ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటానని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details