తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

By

Published : Nov 26, 2020, 8:59 PM IST

etv-bharat-telugu-top-ten-news
టాప్​టెన్​ న్యూస్​@9PM

1. 28న హైదరాబాద్​కు ప్రధాని

హైదరాబాద్​కు ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈనెల 28న హైదరాబాద్​కు మోదీ రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ పురోగతి పరిశీలన కోసం నరేంద్రమోదీ హైదరాబాద్ రానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.ఎస్​ఈసీ ఆగ్రహం

గ్రేట‌ర్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ నేతలు నిరాధారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... కొందరు నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్లు గమనించామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.'తెలంగాణపై సవతి తల్లి ప్రేమ'

హైదరాబాద్​లోని పలు డివిజన్లలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్​షో నిర్వహించారు. తెరాస అభ్యర్థులను పెద్ద మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాలని ఆయన సూచించారు. కేంద్రంపై మండిపడిన కేటీఆర్... దిల్లీ నుంచి కమలం పెద్దలు గుంపులు రాష్ట్రానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.భాజపా వరాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికారానికి వస్తే... ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని భాజపా ప్రకటించింది. జీహెచ్​ఎంసీ భాజపా ఎన్నికల మేనిఫెస్టోను... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విడుదల చేశారు. సామాన్యుల ఆకాంక్షల మేరకే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వరదసాయం కింద అర్హులందరికీ... 25 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తామని మేనిఫెస్టోలో భాజపా హామీ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.రాష్ట్రంపై నివర్​ ఎఫెక్ట్​

నివర్​ ప్రభావం రాష్ట్రంపై ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.రైతన్న ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై.. రైతన్న ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఆ చట్టాలను నిరసిస్తూ.. పంజాబ్​, హరియాణా నుంచి రైతులు దిల్లీకి పయనమయ్యారు. అయితే.. సరిహద్దుల్లో హరియాణా, దిల్లీ పోలీసుల అడ్డగింతతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా.. అక్కడి యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కేంద్రం కీలక సూచన

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్​లో చర్చించారు హోంశాఖ కార్యదర్శి అజయ్​ కుమార్​ భల్లా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.రెచ్చిపోయిన ముష్కరులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. శ్రీనగర్​ హెఎమ్​టీ ప్రాంతంలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఒక్కటైన మల్లయోధులు

మరో రెజ్లింగ్‌ ప్రేమ జంట పెళ్లిపీటలెక్కింది. భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా, సంగీత ఫొగాట్‌ బుధవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్​మీడియాలో పంచుకున్నారీ నూతన వధూవరులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.తొమ్మిది మంది విలన్లా..?

సినిమాకి విలన్‌ దొరకడం అంత సులభమా? దర్శకుల్ని ఈ మాట అడిగితే కష్టమే అంటారు. హీరోయిన్‌ కోసం ఎంతగా వెతుకుతున్నారో, విలన్‌ కోసమూ అంతే వెతుకుతున్నారు. అలాంటి ఈ రోజుల్లో ఓ సినిమాలో తొమ్మిది మంది విలన్లు అంటే నమ్ముతారా? టాలీవుడ్‌లో నడుస్తున్న చర్చ చూస్తే నమ్మకతప్పదు అనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details