తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు.

By

Published : Nov 18, 2020, 8:59 PM IST

టాప్​టెన్​ న్యూస్​@9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM

1.తెరాస తొలి జాబితా

జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితాను తెరాస విడుదల చేసింది. 105 మంది అభ్యర్థులతో తెరాస అధిష్ఠానం జాబితాను ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'వందకు పైగా సీట్లు గెలుస్తాం'

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు కచ్చితంగా గెలుస్తామని కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రశాంతమైన హైదరాబాద్‌ కావాలా.. అల్లర్ల హైదరాబాద్‌ కావాలా.. అభివృద్ది కావాలా? అశాంతి రాజ్యమేలాలా.. ప్రజలు ఆలోచించాలని కేసీఆర్‌ సూచించారు. ప్రజలను కాపాడే బాధ్యత తెరాసపైనే ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.'కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరు'

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా తెరాస దేశవ్యాప్త యుద్ధం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. డిసెంబరు రెండో వారంలో హైదరాబాద్​లో దేశంలోని వివిధ రాజకీయ పక్షాలతో కలిసి జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.కాంగ్రెస్​ తొలి జాబితా

29 మంది అభ్యర్థులతోకాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేసింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 22 మందిని, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 మందిని ఎంపిక చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'21న పోలింగ్​ కేంద్రాల తుది జాబితా'

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరుకు ఓటింగ్​ స్లిప్​లు అందేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారథి సూచించారు. ఎన్నికల్లో సాధారణ ఎన్నికల పరిశీలకుల పాత్ర అత్యంత విలువైందని.. ఒక్కో జోన్ పరిధిలోని వార్డులకు ఒక సాధారణ ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఈ నెల 21న ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వరదసాయానికి బ్రేక్​

వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌ వేసింది. గ్రేటర్ ఎన్నికలు ఉన్నందున ప్రక్రియను వెంటనే ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో కోడ్ అమల్లో ఉండగా ఇలా సాయం చేయడంపై పలు పార్టీలతోపాటు... స్వచ్ఛందసంస్థలు ఫిర్యాదు చేయడంపై ఎన్నికల సంఘం స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.ఏపీలో 1236 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 1236 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 8,57,395కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.జవాన్ల కోసం హీట్​ టెంట్లు

శీతాకాలం దృష్ట్యా... సరిహద్దుల్లో బలగాలకు వసతి సౌకర్యాలను పెంచింది భారత సైన్యం. తూర్పు లద్దాఖ్​ ఫ్రంట్‌లైన్‌లో విధులు నిర్వహించే బలగాల కోసం హీట్‌ టెంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.కాంగ్రెస్​ కీలక నిర్ణయం

బంగాల్​ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23 నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.థియేటర్​లోనే 'సోలో బ్రతుకే సో బెటర్​'

హీరో సాయిధరమ్​ తేజ్​ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' సినిమా డిసెంబరులో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్​. అది కూడా థియేటర్లలలోనే రిలీజ్​ చేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details