తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ ఆకస్మిక మృతి - ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ ఆకస్మిక మృతి

విధి నిర్వహణలో న్యూస్ కంట్రిబ్యూటర్ మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని ఒంగోలులో జరిగింది. మృతుడు ఈటీవీ భారత్ తరపున వార్తా సేకరణలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

etv bharat reporter death
etv bharat reporter death

By

Published : Jan 10, 2020, 11:40 AM IST

అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించ తలపెట్టిన వార్తా సేకరణలో ఉన్న ఈటీవీ న్యూస్ కంట్రిబ్యూటర్ వీరగంధం సందీప్ కుమార్(32) గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్​లోని ఒంగోలు ఫ్లై ఓవర్ వద్ద తెదేపా నేతలను పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న... సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కొప్పొలులోని నివాసానికి తరలించారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్, ఉగ్రనరసింహారెడ్డితోపాటు పలువురు పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details