తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ జిల్లాలో కొనసాగుతోన్న ఏనుగుల దాడి.. మరో రైతుకు గాయాలు - చిత్తూరు తాజా వార్తలు

ELEPHANTS ATTACK : ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఏనుగుల దాడిలో కారు నుజ్జునుజ్జు అయిన ఘటన మరువక ముందే.. తాజాగా మరో రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది.

ELEPHANTS ATTACK
ELEPHANTS ATTACK

By

Published : Sep 19, 2022, 4:17 PM IST

Updated : Sep 19, 2022, 4:32 PM IST

ELEPHANTS ATTACK ON FARMER : ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల బీభత్సం కొనసాగుతోంది. తాజాగా జరిగిన దాడిలో గణేష్​​పురానికి చెందిన ఓ రైతు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు. గుంపుగా ఏనుగులు వచ్చి దాడులు చేయడంతో చిత్తూరు జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారుపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి చిత్తూరుకు కారులో వెళ్తున్న కుటుంబం భయభ్రాంతులకు గురై అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో రైతుపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 19, 2022, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details