జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో ఈ రోజు మధ్యాహ్నం భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. మొదట జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో.. ఆ తర్వాత కొద్దిసేపటికే అసోంలో భూమి కంపించింది. ప్రాణభయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు.
సింగ్‌భూమ్‌లో 2గంటల 22 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. తర్వాత అసోంలో 2గంటల 40నిమిషాలకు భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.