ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన దాతలు.. ఏపీలోని అనంతపురం జిల్లా తనకల్లులో చూపు కోల్పోయిన విద్యార్థి శ్రీనిత్యకు ఆర్థిక సాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన బీటెక్ విద్యార్థిని శ్రీనిత్య అనారోగ్యంతో చూపు కోల్పోయింది. ఆమె ఆరోగ్య, కుటుంబ పరిస్థితులపై ఈటీవీ భారత్లో కథనం వచ్చింది.
"ఈటీవీ భారత్" కథనానికి స్పందన .. శ్రీనిత్యకు ఆర్థిక సాయం
'నిత్య' రోదన పేరుతో ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. ఏపీలోని అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో కంటి చూపు కోల్పోయిన శ్రీనిత్యకు స్పేస్ విద్యా సంస్థల యాజామాన్యం ఆర్థిక సాయం చేసింది.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన .. చూపు కోల్పోయిన శ్రీనిత్యకు సాయం
కదిరి పట్టణానికి చెందిన హరీష్, స్పేస్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు పద్మ, శ్రీనివాస్... శ్రీనిత్యకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. పద్మ, శ్రీనివాస్ల కుమారుడు ప్రశాంత్ శ్రీనిత్యకు చెక్కు అందించారు. విజయవాడకు చెందిన ఎన్ఆర్ ఎంటర్ ప్రైజెస్ యజమాని వెంకటేశ్వరరావు రూ.6 వేలు శ్రీనిత్య కుటుంబానికి ఇచ్చారు.
ఇదీ చూడండి:హోటళ్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి