తెలంగాణ

telangana

ETV Bharat / city

'మద్యం సేవించి వాహనం నడపవద్దు' - Bandlaguda_Dakshina mandalam_RTA office

మద్యం సేవించి వాహనం నడపవద్దని...రోడ్డుపై ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని దక్షిణ మండల ఆర్టీఓ సదానందం వాహనదారులకు సూచించారు. హైదరాబాద్ బండ్లగూడ దక్షిణ మండల ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది... హెల్మెట్లు ధరించి నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీని ఆయన జెండాఊపి ప్రారంభించారు.

Road_Safety_Programme
Road_Safety_Programme

By

Published : Feb 1, 2020, 10:46 PM IST

వాహనాలపై ట్రిపుల్​ రైడింగ్​ చేయవద్దని... అతివేగం, నిర్లక్ష్యంతో బండ్లు నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకోరాదని దక్షిణ మండల ఆర్టీఓ సదానందం ప్రజలకు సూచించారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బండ్లగూడ దక్షిణ మండల ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది... హెల్మెట్లు ధరించి చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీని ఆయన జెండాఊపి ప్రారంభించారు.

ప్రజలందరూ ట్రాఫిక్​ నియమాలను పాటించాలని చెప్పారు. వాహన చోదకులు శిరస్త్రాణం ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిపేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. హెల్మెట్​ ధరిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణహాని ఉండే అవకాశాలు తక్కువని... గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతామన్నారు. అంబులెన్స్​ వచ్చినపుడు తప్పనిసరిగా దారి ఇవ్వాలని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కలిగే నష్టాలను వివరించారు.

దక్షిణ మండల ఆర్టీఏ సిబ్బంది హెల్మెట్​ ర్యాలీ

ఇదీ చూడండి: బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత

ABOUT THE AUTHOR

...view details