తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2021, 8:03 PM IST

ETV Bharat / city

ఏప్రిల్‌ 14 నుంచి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి

ఏపీలోని తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 14 నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి ఇచ్చింది. టికెట్లున్నవారు మూడు రోజుల ముందు కరోనా పరీక్షలు చేసుకుని నెగిటివ్‌ రిపోర్ట్‌ చూపాలని సూచించింది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలపై.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 14 నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లున్నవారు మూడు రోజుల ముందు కరోనా పరీక్షలు చేసుకుని.. వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద కొవిడ్​ నెగిటివ్‌ రిపోర్ట్‌ చూపాలని సూచించింది.

కరోనా దృష్ట్యా ఏడాదిగా.. ఏకాంత ఆర్జిత సేవలు నిర్వహించిన తితిదే.. ఉత్సవమూర్తులకు చేసే సేవల్లో భారీ మార్పులు చేసింది. ఇకపై ఏడాదికోసారి విశేష పూజ, సహస్ర కళశాభిషేకం, సాలకట్ల ఉత్సవంగా వసంతోత్సవం జరపనున్నట్లు తెలిపింది. ఉత్సవమూర్తుల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:'వయోపరిమితి పెంపు వద్దు.. ఉద్యోగ విరమణ చేస్తా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details