తెలంగాణ

telangana

ETV Bharat / city

నగరంలో అటకెక్కిన చెరువుల సుందరీకరణ - GHMC

నగరంలో చెరువుల సుందరీకరణ నిలిచిపోయింది. గుత్తేదారులు జాప్యం చేయడం వల్ల చెరువులో మురుగు నీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయి. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

Delay LAKES BEAUTIFICATION IN hyderabad
నగరంలో అటకెక్కిన చెరువుల సుందరీకరణ

By

Published : Dec 25, 2019, 8:49 AM IST

హైదరాబాద్​లో చెరువుల సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. శేరిలింగంపల్లిలోని పలు చెరువులను పర్యటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని జీహెచ్​ఎంసీ, ఇరిగేషన్​శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను చేపట్టారు. రెండు సంవత్సరాలుగా పనులు ప్రారంభించిన గుత్తేదారులు జాప్యం చేయడం వల్ల చెరువులో మురుగు నీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే వాటిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నగరంలో అటకెక్కిన చెరువుల సుందరీకరణ

ABOUT THE AUTHOR

...view details