క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ప్రతి ఒక్కరు సమయం ఉన్నప్పుడు కచ్చితంగా ఆటలు ఆడాలని సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. బ్యాట్ చేత పట్టి బంతిని పరుగులు పెట్టించారు.
డ్యూటీలో నేరస్థుల వేట.. గ్రౌండ్లో క్రికెట్ ఆట! - Police cricket matches in Cyberabad
ఎప్పుడూ తుపాకీ పట్టుకుని నేరస్థులను వేటాడే పనిలో ఉండే సైబరాబాస్ సీపీ సజ్జనార్.. నేడు క్రికెట్ బ్యాట్ చేత పట్టి బంతిని పరుగులు పెట్టించారు. నేరస్థుల వేటే కాదు.. క్రికెట్ ఆటలోనూ తనకెవరూ సాటిరారని నిరూపించారు.
క్రికెట్ ఆటలోనూ సజ్జనార్‌కు సాటిలేరు!
నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణలో తీరక లేకుండా ఉండే సజ్జనార్ తోటిసిబ్బందితో ఆటవిడుపుగా క్రికెట్ ఆడి పోలీసు శాఖలోని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈనెల చివరి వారంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు పలు రకాల క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. సన్నాహక మ్యాచ్‌లో సజ్జనార్ నేతృత్వంలోని జట్టు నేడు క్రికెట్ ఆడింది.