తెలంగాణ

telangana

ETV Bharat / city

సెలెక్ట్ కమిటీకి ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు - capital decentraliztion, crda bills to selection committee

ఆంధ్రప్రదేశ్​ శాసనమండలిలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను మండలి ఛైర్మన్ సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు.​

capital decentraliztion, crda bills to selection committee
capital decentraliztion, crda bills to selection committee

By

Published : Jan 22, 2020, 11:38 PM IST

ఏపీ శాసన మండలిలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు. తనకున్న విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెలెక్ట్‌ కమిటీకి పంపడంతో మూడు నెలలపాటు ఈ బిల్లులు పెండింగ్‌లో ఉండే అవకాశముంది. మరోవైపు శాసన మండలి ఛైర్మన్‌ నిర్ణయంపై తెదేపా సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది.

మండలి నిర్ణయం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మందడం రహదారిపైకి వచ్చి సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు పట్టుకొని జై అమరావతి అంటూ ర్యాలీలు నిర్వహించారు.

సెలెక్ట్ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు

ఇదీ చూడండి: మందడంలో రైతుల సంబరాలు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details