తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు - cpi leader narayana

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు, దేశ ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.

నగరంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు
నగరంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

By

Published : Dec 7, 2019, 9:51 AM IST

హైదరాబాద్​లో నేడు, రేపు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. హిమాయత్​నగర్​లోని సీపీఐ కార్యాలయంలో జరిగే ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో కోల్​కతాలో జరిగే సీపీఐ మహా నిర్మాణ సభలో చర్చించడాని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలు... ఛత్తీసగఢ్​ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు చెప్పారు.

ఎన్​కౌంటర్లను ఖండిస్తున్నాం..

వామపక్ష పార్టీలు ఎన్​కౌంటర్లను సమర్థించవని నారాయణ తెలిపారు. దిశ నిందితులను ఎన్​కౌంటర్ చేయడం సరికాదన్నారు.

నగరంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఇవీచూడండి: మానసిక అత్యాచారాలెన్నో... మనసు పడే వేదనలెన్నో!

ABOUT THE AUTHOR

...view details