తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2020, 8:27 PM IST

ETV Bharat / city

మంత్రి ఈటల మాటలు బాధ కలిగించాయి: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధితుడు ఆక్సిజన్​ అందడం లేదని.. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో తీసి పంపించే దయనీయ స్థితి వచ్చిందని వాపోయారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల స్పందించిన తీరు బాధించిందన్నారు.

clp leader bhatti
మంత్రి ఈటల మాటలు బాధ కలిగించాయి: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన అన్నింటిని పక్కన పెట్టి కరోనా నివారణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

హైదరాబాద్‌లో పరిస్థితిపైనా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితుడు తన చివరి క్షణాల్లో... ఆక్సిజన్‌ దొరకడం లేదు.. ఊపరి ఆడక తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో రికార్డు చేసి పంపుతున్న దయనీయ పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సింది పోయి... మరణించే వాళ్లు రికార్టు చేసి వీడియో పంపడం న్యాయమా.. అని ఆరోగ్య శాఖ మంత్రి మానవత్వం లేకుండా మాట్లాడడం తగునా అని భట్టి ప్రశ్నించారు.

ఈటల మాటలు కోటలు దాటుతున్నాయని.. తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఒక సామాన్యుడికి కరోనా సోకితే ఎక్కడికెళ్లి వైద్యం చేయించుకోవాలో తెలియని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి.. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులో ఉచితంగా చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీచూడండి:ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం

ABOUT THE AUTHOR

...view details