తెలంగాణ

telangana

ETV Bharat / city

'రైతుల నుంచి రూ.5223 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం'

యాసంగిలో ఇప్పటి వరకు 6057 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.86 లక్షల మంది రైతుల నుంచి రూ.5,223 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

By

Published : May 5, 2020, 9:55 PM IST

civil supplies chairmen announments on paddy collection
'రైతుల నుంచి రూ.5223 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం'

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చురుగ్గా సాగుతోందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యాసంగిలో ఇప్పటి వరకు 6057 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.86 లక్షల మంది రైతుల నుంచి రూ.5,223 కోట్ల విలువైన 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలోనే రూ.2,378 కోట్ల వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. రైతుల నుంచి సేకరించిన 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 26.89 లక్షల మెట్రిక్ టన్నులు కస్టం మిల్లింగ్-సీఎంఆర్ కోసం రైసు మిల్లులకు తరలించడం జరిగిందని చెప్పారు. ఒక్క మంగళవారం 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే, రైతుల ఖాతాలో రూ.249 కోట్ల జమ చేసినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఇవీచూడండి:రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్​డౌన్​పై కీలక చర్చ

ABOUT THE AUTHOR

...view details