హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జియాగూడ కమెల వద్ద సచిన్ అనే యువకుడిని కార్తీక్ అనే మరో యువకుడు హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
కుల్సుంపురాలో వ్యక్తిని హత్య చేసి పరారైన యువకుడు - crime news latest
చిన్న చిన్న గొడవలు... ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో ఆలోచించకుండా ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కుల్సుంపురాలో ఓ వ్యక్తిని... మరో యువకుడు దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
కుల్సుంపురాలో వ్యక్తిని హత్య చేసి పరారైన యువకుడు
సమాచారం అందుకున్న కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో వారికి మద్యం సీసాలు లభించాయి. తాగుడు విషయంలో మాటామాటా పెరిగి హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీచూడండి: దావోస్లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం