బేగంపేట పోలీస్ క్వార్టర్స్‌లో సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామచందర్ పెరట్లో బ్రహ్మ కమలం పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. కేవలం హిమాలయ పర్వతాల్లో కనిపించే బ్రహ్మకమలాలను బేగంపేటలో చూసి అందరూ ఆశ్చర్యనికి గురవుతున్నారు. సహచర పోలీసు అధికారి ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన బ్రహ్మకమలం ఆకులను నాటినట్టు ఇన్స్పెక్టర్ రామచందర్ తెలిపారు. రోజూ నీరు పోస్తూ... ఎరువులు వేసి మొక్కను కంటికిరెప్పలా కాపాడినట్టు చెప్పారు.
బేగంపేట పోలీస్ క్వార్టర్స్‌లో బ్రహ్మకమలాలు
హిమాలయాల్లో కనిపించే బ్రహ్మ కమలం పూలు హైదరాబాద్ బేగంపేట పోలీసు క్వార్టర్స్‌లో కనిపిండం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆరు సంవత్సరాల క్రితం సహచర అధికారి ఇచ్చిన బ్రహ్మకమలం ఆకులను నాటగా... ఈ సారి మొట్టమొదటిసారిగా పూలు వచ్చాయని సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామచందర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆరు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మ కమలం పుష్పాలు రావడం పట్ల రామచందర్ సంతోషం వ్యక్తం చేశారు. శివపార్వతులకు ఎంతో ఇష్టమైన సోమవారం నాడు బ్రహ్మకమలం పుష్పాలు విరబూయడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రహ్మ కమలం మొక్కలతో పాటు ఇతర పూల మొక్కలను నాటడం తనకెంతో ఇష్టమన్నారు. బ్రహ్మ కమలం పుష్పాలు కేవలం కొన్ని గంటలపాటు వికసించి ఉంటాయని ఆ పుష్పాలు వికసించే విధానం కనువిందుగా ఉంటుందని తెలిపారు. అత్యంత అరుదుగా ప్రదర్శించే బ్రహ్మకమలం పుష్పాలు తన ఇంట్లో రావడం ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు.