తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా పరిస్థితుల్లో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న రోగులను ఆదుకునేందుకు సరైన సమయంగా భావించి నాయకులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు.
తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం - తెరాస కార్యాలయంలో రక్తదానం
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర తెరాస కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించగా పలువురు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరై రక్తదానం చేశారు.
తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం
భౌతిక దూరం పాటిస్తూ రక్తదానానికి ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఇతర ముఖ్యనాయకులు రక్తందానం చేశారు.
ఇదీ చూడండి: కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం