తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును ఖండించిన భాజపా - bjp telangana news

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒక్కవారంలోనే 14 హత్యలు, హత్యాచారాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును ఖండించిన భాజపా
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును ఖండించిన భాజపా

By

Published : Dec 3, 2019, 11:36 PM IST

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులపై తెరాస ప్రభుత్వం దమనకాండ ప్రయోగించిందని మండిపడ్డారు. డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులను ప్రగతిభవన్‌కు పిలుపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతుందన్నారు. అవినీతి, ఆత్మహత్యలు, హత్యలు, హత్యాచారాల్లో తెలంగాణ ఏ స్థానాల్లో ఉందో ఇటీవల ప్రకటించిన జాబితాల్లో అర్థమవుతుందన్నారు. ఒక్క వారంలోనే రాష్ట్రంలో 14 హత్యలు, హత్యాచారాలు జరిగాయని మండిపడ్డారు.

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును ఖండించిన భాజపా
ఇవీ చూడండి : ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలి: జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details