రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి... ఆ భారాన్ని ప్రజలపై మోపారని మండిపడ్డారు. పెరిగిన ఛార్జీలతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పటికీ ఛార్జీలు పెంచకుండానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని... కానీ మన రాష్ట్రంలో విలీనం చేయకుండానే ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. పెంచిన ఛార్జీలను తగ్గించకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తగ్గించి... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగ్గారెడ్జి తెలిపారు.
ఇవీ చూడండి: 'దిశ' నిందితుల చర్లపల్లి జైలు వీడియో...