'బిగ్‌బాస్' ఫేమ్ గంగవ్వ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గంగవ్వ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. 'నా కొత్త ఇళ్లు పూర్తి అయ్యింది. దీనికి సహకరించిన మా చిన్నన్న నాగార్జున సర్‌కి, బిగ్‌బాస్ టీమ్‌కు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
gangavva: గృహ ప్రవేశం చేసిన 'బిగ్‌బాస్' ఫేమ్ గంగవ్వ - బిగ్‌బాస్4 ఫేమ్ గంగవ్వ
బిగ్‌బాస్, నాగార్జున కలిసి కట్టించిన ఇంట్లోకి బిగ్‌బాస్4 ఫేమ్ గంగవ్వ గృహ ప్రవేశం చేసింది. ఈ సందర్భంగా గంగవ్వ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
బిగ్‌బాస్4 సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపిక అయిన గంగవ్వ.. తన అనారోగ్య కారణంగా హౌజ్ నుంచి మధ్యలోనే నిష్క్రమించింది. ఆ సమయంలో నాగార్జునని, బిగ్‌బాస్‌ను.. తనకు ఓ ఇళ్లు కట్టించమని కోరగా.. ఆమె కోరికను వారు అంగీకరించారు. ఇంటి పనులు చక చకా ప్రారంభించారు. తాజాగా మంగళవారం తన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్4 ఫేమ్ అఖిల్ సార్థక్, యాంకర్ సావిత్రితో పాటు పలువురు పాల్గొని సందడి చేశారు.
ఇదీ చూడండి: Allu Arjun News: 'దోశ' తెచ్చిన తలనొప్పి.. అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసులు..